Manipusalu
🍃జీవన 🍃 🍃మణిపూసలు🍃 1 అల లాగ ఎగిసి పడకు కల లాగ మిగిలి పోకు! జీవిత ప్రయాణంలో శిల లాగ ఉండి పోకు!! 2 స్వార్ధములో చిక్కిపోకు కోపము లో నలిగిపోకు! జీవిత ప్రయాణంలో ఆశగాను ఉండి పోకు!! 3 ధనముతో మునిగిపోకు బంధాలు తెంచుకోకు! జీవిత ప్రయణములో ఒంటరిన బతక బోకు!! 4 బాధలతో ఉండి బోక కన్నీరును కార్చుబోకు! జీవిత ప్రయణములో మదిలోన క్రుంగి పోకు!! 5 పాపాలే చేయబోకు కష్టాలనే పడమాకు! జీవిత ప్రయణములో ప్రశ్నలనే నిలువబోకు!! *అమ్మ* 6 కడుపులో నిన్ను మోసితి పేగు మోడలో వేసితి! నొప్పులను చీల్చుతూ సృష్టిలో దారి చూపితి!! 7 నిన్ను చూసే మురిసితిని నీ నవ్వుతో నవ్వితిని! నీ ఆలోచన ఊహల లో ప్రతి దినం గడిపితిని!! 8 నీకు లాల పోసిన నే ఊయ్యాలూపిన! హాయిగా సేదతీరా లనియె జోల పాడిన!! 9 బుజ్జగించి బువ్వపెట్టి తప్పటడుగులు సరిపెట్టి! కంటి రెప్పలా చూసిన ప్రపంచంలో నిలబెట్టి!! 10 నా ప్రాణమై వెలసితివి కను రూపమై విరిసితివి! అంతయు నువ్వే ఆశల- పంటగానే నిలిచితివి!! ...